పోర్న్ వీడియోల ప్రభావంతో భార్యపై క్రూరత్వం.. కోర్టు ఏమని తీర్పునిచ్చిందంటే..

ABN , First Publish Date - 2022-03-03T22:06:19+05:30 IST

ఆమెకు మూడేళ్ల క్రితం వివాహమైంది.. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి..

పోర్న్ వీడియోల ప్రభావంతో భార్యపై క్రూరత్వం.. కోర్టు ఏమని తీర్పునిచ్చిందంటే..

ఆమెకు మూడేళ్ల క్రితం వివాహమైంది.. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి.. అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించారు.. భర్త అసహజ శృంగార కోరికలతో ఆమెకు నరకం చూపించాడు.. పోర్న్ వీడియోలు చూసి అలాగే చేయాలని భార్యను వేధించేవాడు.. ఆమె గర్భం దాల్చాక కూడా అతను తన పంథా మార్చుకోలేదు.. ఫలితంగా ఆమెకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి.. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భజరంగ్ నగర్‌కు చెందిన బాధిత మహిళ 2019లో రాహుల్ బిజ్వేను వివాహం చేసుకుంది. వివాహం జరిగిన రెండు వారాల తర్వాత అత్తమామలు రూ.10 లక్షల అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించారు. తీసుకురాలేదని చిత్రహింసలు పెట్టారు. మరోవైపు భర్త అసహజ శృంగార కోరికలతో వేధించాడు. పోర్న్ వీడియోలో మహిళలు చేసేలా చేయమని బలవంతం చేసేవాడు. ఈమె ఏడ్చినా వినేవాడు కాదు. గర్భం దాల్చాక కూడా అతను ఆమెను వదల్లేదు. బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సూచించినా అతను వినకుండా అసహజ భంగిమల్లో శృంగారం సాగించాడు. దీంతో ఆమెకు బ్లీడింగ్ జరిగింది. 


నెలన్నర ముందుగానే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. ఆపరేషన్ జరిగిన వారం రోజులకే బాధిత మహిళను రాహుల్ మళ్లీ బలవంతం చేశాడు. దీంతో ఆమె అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. రెండేళ్ల పాటు ఈ పిటిషన్‌ను విచారించిన ఇండోర్ జిల్లా కోర్టు తాజాగా తుదితీర్పు వెలువరించింది. మహిళకు విడాకులు మంజూరు చేసింది. అలాగే నిందితుడికి రూ.1.30 లక్షల జరిమానా విధించింది. ప్రతి నెలా ఖర్చుల కోసం రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశించింది. 

Updated Date - 2022-03-03T22:06:19+05:30 IST