వద్దంటున్నా భర్త బలవంతం.. కాళ్లు, చేతులు కట్టేసి మరీ పైశాచిక ప్రవర్తన.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-22T21:48:02+05:30 IST

భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటేనే సంసారం సవ్యంగా సాగుతుంది. లేదంటే రోజూ సమస్యలతో సహజీవనం చేయాల్సి వస్తుంది. భార్యే కదా.. ఏం చేసినా పడుంటుందిలే అనే దీమాలో కొందరు భర్తలు తమ పైశాచికత్వాన్ని దారుణంగా...

వద్దంటున్నా భర్త బలవంతం.. కాళ్లు, చేతులు కట్టేసి మరీ పైశాచిక ప్రవర్తన.. చివరకు ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటేనే సంసారం సవ్యంగా సాగుతుంది. లేదంటే రోజూ సమస్యలతో సహజీవనం చేయాల్సి వస్తుంది. భార్యే కదా.. ఏం చేసినా పడుంటుందిలే అనే దీమాలో కొందరు భర్తలు తమ పైశాచికత్వాన్ని దారుణంగా ప్రదర్శిస్తుంటారు. భర్త పెట్టే చిత్రహింసలను కొందరు మహిళలు బయటికి చెప్పుకోలేక.. పంటి బిగువున భరిస్తుంటారు. మరికొందరు ఎందుకొచ్చిన జీవితమంటూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇంకొందరైతే ఎదురు తిరిగి భర్తతో తెగతెంపులు చేసుకుని, స్వేచ్ఛా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మహారాష్ట్రలో ఓ భర్త తన భార్య పట్ల ప్రవర్తించిన తీరు.. అంతా అసహ్యించుకునేలా ఉంది. వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 2017లో వివాహమైంది. పెళ్లయిన కొన్ని నెలల వరకు వీరి సంసారంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే తర్వాత భర్త మద్యానికి అలవాటుపడ్డాడు. క్రమంగా అది వ్యసనంగా మారింది. కొన్నాళ్లు పోతే మారతాడులే అనుకుని అతడి వేధింపులను భార్య భరిస్తూ వచ్చింది. అయితే అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. గొడవలతో ఆగకుండా బలవంతపు శృంగారానికి పాల్పడేవాడు. వద్దని భార్య వేడుకుంటున్నా వినకుండా.. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి.. అరవకుండా నోట్లో బట్టలు కుక్కి మరీ అత్యాచారం చేసేవాడు. ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడు. కొన్నాళ్లు భరించిన ఆమె.. రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో విసిగిపోయింది.

బంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన భార్య.. తాళం తీసి గదిలోకి వెళ్లగానే బెడ్రూంలో అర్ధనగ్నంగా ఓ యువతి శవం.. ట్విస్ట్ ఏంటంటే..


రోజూ మద్యం తాగొచ్చి బలవంతంగా శృంగారం చేస్తుండడం, చిత్రహింసలు పెడుతుండడంతో విసిగిపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పుకొని బోరున విలపించింది. ఇక భర్తతో కలిసి జీవించలేని తెగేసి చెప్పింది. శాడిస్టు భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ తల్లిదండ్రులతో కలిసి నాగ్‌పూర్ కోర్టును ఆశ్రయించింది. బలవంతపు శృంగారాన్ని న్యాయస్థానం తీవ్రమైన చర్యగా పరిగణించింది. బాధితురాలికి వెంటనే విడాకులు మంజూరు చేస్తున్నట్లు సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.

అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు.. పొద్దున్నే భార్యను పిలిస్తే గదిలోంచి నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూస్తే..

Updated Date - 2022-02-22T21:48:02+05:30 IST