సూసైడ్ వీడియోలో బోరున విలపించిన భర్త.. అందులో తన భార్య గురించి..

ABN , First Publish Date - 2022-02-04T21:11:07+05:30 IST

అతడికి మూడేళ్ల క్రితమే పెళ్లైంది. వివాహమైన కొత్తలో భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవారు. తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే భర్త సంచలన నిర్ణయం తీ

సూసైడ్ వీడియోలో బోరున విలపించిన భర్త.. అందులో తన భార్య గురించి..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి మూడేళ్ల క్రితమే పెళ్లైంది. వివాహమైన కొత్తలో భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవారు. తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తన మరణానికి గల కారణాలను వివరిస్తూ వీడియో రికార్డు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన అనిల్ మీనా అనే యువకుడికి పూజా అనే మహిళతో మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి క్రమంగా గొడవలకు దారి తీశాయి. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనిల్ మీనా ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ వీడియో తీశాడు. ‘తన తల్లిదండ్రులతో కలిసి నా భార్య నన్ను పదేపదే బెదిరిస్తోంది. నా తల్లిదండ్రులపై, నాపై అక్రమంగా కేసులు పెడతానని బెదిరింపులకు దిగుతోంది. విడాకులు తీసుకుని వెళ్లిపోవాలని కోరినా.. అందుకు ఆమె నిరాకరిస్తోంది. నా భార్య పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా. నా మరణానికి నా భర్య, ఆమె కుటంబ సభ్యులే కారణం. వారిపై పోలీసులు తిగిన చర్యలు తీసుకోవాలి’ అని చెప్పి అనిల్ కన్నీటి పర్యంతం అయ్యాడు. 


అనిల్ మీనా ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలియడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.




Updated Date - 2022-02-04T21:11:07+05:30 IST