నీ భార్య అందగత్తె.. అని అంతా అంటోంటే మొదట్లో పొంగిపోయాడు.. కానీ ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆ భర్త ఇలా చేస్తాడనుకోలేదు..!

ABN , First Publish Date - 2021-12-23T20:31:02+05:30 IST

అతనికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.. అందమైన భార్య దొరికింది అని అందరూ అంటుంటే అతను మొదట్లో పొంగిపోయాడు..

నీ భార్య అందగత్తె.. అని అంతా అంటోంటే మొదట్లో పొంగిపోయాడు.. కానీ ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆ భర్త ఇలా చేస్తాడనుకోలేదు..!

అతనికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.. అందమైన భార్య దొరికింది అని అందరూ అంటుంటే అతను మొదట్లో పొంగిపోయాడు.. వారికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.. వైవాహిక జీవితం గడుస్తున్న కొద్దీ భార్య అందం అతనిని చిరాకు పెట్టింది.. ఆమెకు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉందనే అనుమానానికి కారణమైంది.. దీంతో అతను ఆమెను హత్య చేయించాడు.. చివరకు తను విషం తాగేశాడు.. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఈ ఘటన జరిగింది. 


గోపాల్‌గంజ్‌కు చెందిన సద్దాం హుస్సేన్‌కు ఐదేళ్ల క్రితం గుల్బాసా ఖాతూన్ అనే మహిళతో వివాహం జరిగింది. గుల్బాసా అందాన్ని ఇరుగు పొరుగు వారు తరచుగా ప్రశంసించేవారు. మొదట్లో పొంగిపోయిన సద్దాం తర్వాత ఆమెను అనుమానించడం ప్రారంభించాడు. ఐదేళ్లలో సద్దాం ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయినా భార్యపై అతనికి అనుమానం తగ్గలేదు. గుల్బాసా పుట్టింటికి వెళ్లినపుడల్లా ఆమెను రహస్యంగా అనుసరించేవాడు. 


ప్రియుడిని కలిసేందుకు భార్య తరచుగా పుట్టింటికి వెళుతోందని అనుమానించాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇద్దరు కిరాయి హంతకులతో తన భార్యను హత్య చేయించాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కనే పడేశాడు. మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. కొన్ని గంటల్లోనే కిరాయి హంతకులను పట్టుకున్నారు. వారు దొరికిపోయారనే సమాచారం తెలుసుకున్న సద్దాం విషం తాగేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.  

Updated Date - 2021-12-23T20:31:02+05:30 IST