Abn logo
Sep 21 2020 @ 18:34PM

వీల్ చైర్‌ను బైక్‌లా మార్చాడు..

Kaakateeya

నడవలేని స్థితిలో వీల్ చైర్‌కే పరిమితమైన తన భార్యను చూసి భర్త గుండె బరువెక్కింది. ప్రకృతిని అమితంగా ప్రేమించే ఆమె.. ఎటూ కదల్లేని స్థితిలో ఇంటికే పరిమితంకావడం అతడికి అసలు నచ్చలేదు. దీంతో ఆమె వీల్ చైర్‌ను నాలుగు చక్రాల బైక్‌లా మార్చేశాడు. అది సాదాసీదా బైక్ కాదు. పర్వతాలు, మంచు, రాళ్లు, ఇసుకలో సైతం సులువుగా నడిచే రిగ్. 

జాక్ నెల్సన్ అనే యూక్యూబ్ స్టార్ భార్య కెన్రీ. 2005లో గుర్రపు స్వారీ చేస్తూ ప్రమాదానికి గురైంది. దీంతో నడుము కింది భాగానికి పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి ఆమె నడవలేకపోయింది. వీల్ చైర్‌కే పరిమితమయింది. అడ్వేంచర్లు అంటే ఇష్టపడి కెన్రీ ఇంటికే పరిమితంకావడం ఆమె భర్త జాక్‌కు అసలు నచ్చలేదు. 2018లో జాక్‌కు ఓ ఆలోచన వచ్చింది. ఆమె కోసం ఓ ఎలక్ట్రిక్ బైక్ సిద్ధం చేద్దామని అనుకున్నాడు. అనుకున్నట్లే జాక్ .. ఆమె కోసం ఓ బైక్‌ను సిద్ధం చేశాడు. 

Advertisement
Advertisement
Advertisement