Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘నా భార్య మద్యం అమ్మిస్తోంది.. ’

హైదరాబాద్/బౌద్ధనగర్‌ : లాక్‌డౌన్‌తో వైన్‌షాపులు మూసి ఉండడాన్ని డబ్బు సంపాదనకు మార్గంగా మార్చుకోవాలనే దురుద్దేశంతో భర్తతో మద్యం అమ్మిస్తున్న ఓ భార్యపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. మధురానగర్‌కాలనీకి చెందిన క్రాంతి ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు. కరోనా నేపథ్యంలో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ పెట్టడంతో భార్య అలకపల్లి లక్ష్మీగాయత్రి (30), అతడితో బలవంతంగా మద్యం బాటిల్స్‌ అమ్మిస్తోంది. మద్యం అమ్మటం ఇష్టం లేని క్రాంతి తన స్నేహితుల ద్వారా బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. ఎస్‌ఐ సాయికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు లక్ష్మీగాయత్రి ఇంట్లో సోదాలు నిర్వహించి 36 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత లాక్‌డౌన్‌లో కూడా తనతో మద్యం అమ్మించిందని, ఇటీవల తనపై పోలీ్‌సస్టేషన్‌లో తప్పుడు కేసులు పెట్టిందని క్రాంతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Advertisement
Advertisement