తిరుపతి: కాపురంలో ఏం కలతలు వచ్చాయో ఏమో తెలియదు గానీ భార్యను చంపి భర్త బలవన్మరణానికి పాల్పడడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు మాత్రం అనాథలయ్యారు. ఈ ఘోర విషాదం శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ వీధిలో జరిగింది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు భర్త శ్రీనివాసులు(30), భార్య మంజుల(26)గా గుర్తించారు. మృతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా స్థానికులు చెబుతున్నారు. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.