నా భార్య తప్పు చేస్తోంది.. ఇలాంటామె నాకు వద్దు.. అంటూ పంచాయితీలో ఆ భర్త కామెంట్స్.. మరుక్షణమే షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2022-02-18T22:17:08+05:30 IST

‘‘నా భార్య తప్పు చేసింది.. ఇలాంటి భార్య నాకొద్దు’’.. అని భర్త పది మందిలో అన్నాడు. దీంతో ఆ గ్రామంలోని యువకుంతా అక్కడికి చేరుకోవడంతో చివరికి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నా భార్య తప్పు చేస్తోంది.. ఇలాంటామె నాకు వద్దు.. అంటూ పంచాయితీలో ఆ భర్త కామెంట్స్.. మరుక్షణమే షాకింగ్ సీన్..
ప్రతీకాత్మక చిత్రం

భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా.. ఇద్దరూ కలిసి కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేగానీ ఇంట్లోని సమస్యలను బాజారులోకి తీసుకెళ్లకూడదు. కొందరు భర్తలు భార్య గురించి, ఇంకొందరు భార్యలు భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకుంటూ ఉంటారు. చివరికి సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. బీహార్‌లో ఇలాగే జరిగింది. ‘‘నా భార్య తప్పు చేసింది.. ఇలాంటి భార్య నాకొద్దు’’.. అని భర్త పది మందిలో అన్నాడు. దీంతో ఆ గ్రామంలోని యువకుంతా అక్కడికి చేరుకోవడంతో చివరికి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..


బీహార్‌ రాష్ట్రం దర్బాంగ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న రణ్‌వీర్‌ సదా అనే వ్యక్తికి కొన్ని నెలల క్రితం ఓ యువతితో వివాహమైంది. పెళ్లియిన కొత్తలో ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. కొన్నాళ్ల తర్వాత భర్తలోని శాడిస్టు నిద్ర లేచాడు. లేనిపోని అపోహలు పెట్టుకుని భార్యను అనుమానించడం మొదలెట్టాడు. ఎవరెవరితోనో అక్రమ సంబంధాలు అంటగడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. అయినా ఆమె మాత్రం తన బాధలను ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతూ ఉండేది. మరికొన్ని రోజులకు భర్తతో పాటూ అత్తమామలు కూడా ఆమెను అవమానించడం మొదలెట్టారు. అంతటితో ఆగని రణ్‌వీర్.. గ్రామస్తుల ఎదుట పంచాయితీ పెట్టించాడు.

బాబా ఆశ్రమంలో యువతికి రోజుల తరబడి శాంతి పూజలు.. చివరకు ఓ రోజు బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా..


‘‘నాభార్య తప్పు చేస్తోంది.. ఇలాంటి భార్య నాకు వద్దు’’.. అంటూ అందరి సమక్షంలో భార్యను అవమానించాడు. ఇద్దరికీ నచ్చజెప్పాల్సిన పెద్దలు కూడా వారి మాటలు నమ్మారు. అంతలో గ్రామంలోని కొందరు యువకులు అక్కడికి వచ్చి.. ఆమెను బలవంతంగా బజారులోకి లాక్కెళ్లారు. ముఖానికి సున్నం, మసి రాసి జుట్టు కత్తిరించారు. దుర్భాషలాడడంతో పాటూ ఆమెను కొట్టుకుంటూ వీధుల్లో ఊరేగించారు. ‘‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు.. దండం పెడతా నన్ను వదలండి’’.. అంటూ కాళ్లావేళ్లా పడినా ఆ కర్కోటకులు కనికరించలేదు. మహిళ అని కూడా చూడకుండా ఓ వైపు వీడియోలు తీస్తూ.. మరోవైపు ఆమెపై దాడి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో గ్రామ పెద్దలు, పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వరుడిని కంటి చూపుతో కంట్రోల్ చేసిన వధువు.. పెళ్లిమండంపంలో కూడా తగ్గనేలేదు కదా..

Updated Date - 2022-02-18T22:17:08+05:30 IST