ప్రతి వారం 8 మంది బిలియనీర్లు.. ఒకరు ఇండియా నుంచి: హురున్

ABN , First Publish Date - 2021-03-02T22:14:18+05:30 IST

గతేడాది ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు కుదేలైంది. ఈ దేబ్బతో ఎన్నోకోట్ల సంపద ఆవిరైంది. అయినప్పటికీ గతేడాది 412 మంది బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా పుట్టుకొచ్చారు. హురున్ సంస్థ మంగళవారం ..

ప్రతి వారం 8 మంది బిలియనీర్లు.. ఒకరు ఇండియా నుంచి: హురున్

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు కుదేలైంది. ఈ దేబ్బతో ఎన్నోకోట్ల సంపద ఆవిరైంది. అయినప్పటికీ గతేడాది 412 మంది బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా పుట్టుకొచ్చారు. హురున్ సంస్థ మంగళవారం ప్రపంచ సంపన్నుల జాబితా 2021 వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. దాదాపు ప్రతి వారం 8 మంది బిలియనీర్లు కొత్తగా పుట్టుకొస్తున్నారని, వారిలో భారత్‌ నుంచి ఒకరు ఉంటున్నారని హురున్ తన జాబితాలో పేర్కొంది. గతేడాది బిలియనీర్ల జాబితాలో చేరిన వారిలో భారత్ నుంచి 55 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 40 మంది భారత్‌లోనే నివశిస్తున్నారు.


ఇప్పటివరకు భారత్‌లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది భారత్‌లోనే ఉండగా 32మంది విదేశాల్లో ఉన్నారు. ఇక భారత్‌లో ఉన్న వారిలో 60 మంది ముంబై నగరంలోనే నిశసిస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 40 మంది బిలియనీర్లు ఉన్నారు. బెంగళూరులో 22 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక మిగతావారు వేరు వేరు నగరాల్లో ఉన్నారు.


హురుర్ వెలువరించిన భారత బిలియనీర్లలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారత్‌లోని బిలియనీర్లలో టాప్‌లో ఉన్నాడు. రూ.6.05 లక్షల కోట్లతో ఆసియాలో టాప్2లో ఉన్నాడు. ఇక ప్రపంచ జాబితాలో టాప్‌‌10లో ఉన్నాడు. 

Updated Date - 2021-03-02T22:14:18+05:30 IST