US: ఇదా హరికేన్‌తో రికార్డు వర్షం..49 మంది మృతి

ABN , First Publish Date - 2021-09-04T13:26:50+05:30 IST

అమెరికా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఇదా హరికేన్ ప్రభావం వల్ల భారీవర్షాలు కురిశాయి....

US: ఇదా హరికేన్‌తో రికార్డు వర్షం..49 మంది మృతి

న్యూయార్క్ : అమెరికా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఇదా హరికేన్ ప్రభావం వల్ల భారీవర్షాలు కురిశాయి. భారీవర్షాలు, వరదల ధాటికి 49 మంది మరణించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, కనెక్టికట్ల ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాల వల్ల వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో విద్యుత్ సరఫరాలకు అంతరాయం వాటిల్లింది. పలు కార్లు న్యూయార్క్ సిటీ సబ్ వే లైన్లలో కొట్టుకుపోయాయి. పలు విమానాలు వరదనీటిలో మునిగాయి.న్యూయార్క్ నగరంలో వెస్ట్‌చెస్టర్ కౌంటీలోని కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీలో తుపాను ప్రభావం వల్ల  23 మంది మరణించారని ఆ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్ఫీ ట్వీట్ చేశారు. 


న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లోని బేస్‌మెంట్‌లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు, న్యూజెర్సీలోని ఎలిజబెత్‌లో నివసిస్తున్న నలుగురు నివాసితులు 8 అడుగుల నీటితో నిండిన పబ్లిక్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో మునిగి మరణించారు.న్యూజెర్సీ,న్యూయార్క్ రాష్ట్రాల్లో  ఎమర్జెన్సీ  ప్రకటిస్తున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్  చెప్పారు.ఇదా హరికేన్ వల్ల రోడ్లన్నీ నదులుగా మారడంతో డ్రైవర్లు వాహనాలను వదిలివేశారు.న్యూయార్క్ నగరంలో సబ్ వే సర్వీసులు, రైళ్లు, విమానాల రాకపోకలను రద్దు చేశారు.న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ విమానాశ్రయంలో సుమారు 370 విమానాలను రద్దు చేశారు.ఇదా హరికేన్ వల్ల పలు ప్రాంతాల్లో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


Updated Date - 2021-09-04T13:26:50+05:30 IST