Hurricane Ian: 'ఇయన్‌' హరికేన్‌ విధ్వంసం మాములుగా లేదుగా.. ఫ్లోరిడా మొత్తాన్ని తుడిచిపెట్టేసింది!

ABN , First Publish Date - 2022-10-02T18:16:49+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ చూడని పెను విధ్వంసాన్ని 'ఇయన్' హరికేన్ (Hurricane Ian) సృష్టిస్తోంది. ఈ తుపాన్‌ ధాటికి ఫ్లోరిడా (Florida) మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆ రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇయన్ (Ian) వల్ల ఒక్క ఫ్లోరిడాలోనే 47కు మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అటు దక్షిణ కరోలినాపై..

Hurricane Ian: 'ఇయన్‌' హరికేన్‌ విధ్వంసం మాములుగా లేదుగా.. ఫ్లోరిడా మొత్తాన్ని తుడిచిపెట్టేసింది!

ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ చూడని పెను విధ్వంసాన్ని 'ఇయన్' హరికేన్ (Hurricane Ian) సృష్టిస్తోంది. ఈ తుపాన్‌ ధాటికి  ఫ్లోరిడా (Florida) మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆ రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇయన్ (Ian) వల్ల ఒక్క ఫ్లోరిడాలోనే 47కు మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అటు దక్షిణ కరోలినాపై కూడా ఇయన్ తన ప్రతాపం చూపిస్తోంది. అక్కడి చార్ల్‌స్టన్‌ నగరంలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఇప్పటివరకు హరికేన్ ధాటికి మొత్తంగా 54 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది.


సముద్ర జలాలు వీధులను ముంచెత్తడంతో వీధులన్ని నదులను తలపిస్తున్నాయి. ఇక భీకర గాలుల వల్ల చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. తుపాన్​ ధాటికి విద్యుత్తు సౌకర్యం లేక చాలా మంది అంధకారంలో గడుపుతున్నారు. అలాగే తినేందుకు ఆహార పదార్థాలు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వరద నీరు పోటెత్తుతుండడంతో ప్రజలు ఇళ్లల్లో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. 


విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వల్ల వల్ల ఆక్సిజన్‌ యంత్రాలు పనిచేయక ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. ధ్వంసమైన ఇళ్లలో శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడానికి సహాయక సిబ్బంది బోటుల్లో వెళ్లి మరీ గాలిస్తున్నారు. వరద నీరు పోటెత్తుతుండడంతో తమ కళ్ల ముందే ఇళ్లు కొట్టుకుపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. కరెంట్ స్తంభాలు కుప్పకూలడంతో విద్యుత్ ప్రసారం పూర్తిగా నిలిచిపోయింది. దాంతో ఫ్లోరిడా వ్యాప్తంగా సుమారు 2.8లక్షల మంది అంధకారంలో గడుపుతున్నారని అధికారులు తెలిపారు. 


విద్యుత్‌ను పునరుద్ధరించడానికి సిబ్బంది నిర్విరామంగా పని చేయడంతో పరిస్థితి కాస్త మెరుగైందని పేర్కొన్నారు. అమెరికాలో చరిత్రలో అత్యంత శక్తిమంతమైన హరికేన్లలో ఒకటిగానే కాదు.. భారీ స్థాయిలో ఆస్తి నష్టాన్ని కలిగించినవాటిలో ఒకటిగా ఇయన్‌ తుపాన్ నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు. 1921 తర్వాత ఇప్పుడే ఈ స్థాయిలో హరికేన్‌ ఏర్పడిందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ తుపాను కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.









Updated Date - 2022-10-02T18:16:49+05:30 IST