కప్ప చేసిన పనికి నివ్వెరపోతున్న ప్రపంచం!

ABN , First Publish Date - 2020-02-10T15:05:58+05:30 IST

ఆకలేసిందని విష సర్పాన్ని మింగేసిన కప్ప

కప్ప చేసిన పనికి నివ్వెరపోతున్న ప్రపంచం!

క్యాన్‌బెరా: కప్పలు పాములకు ఆహారం అనేది ప్రకృతి విధించిన నియమం. దీనికి విరుద్ధం జరిగితే అది పెను సంచలనానికి దారితీస్తుంది. సరిగ్గా అటువంటి ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో జరిగింది. క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో గ్రీన్ ట్రీ ఫ్రాగ్ అనే కప్ప ఓ విషసర్పాన్ని మింగేసింది. అదేదో ఆషామాషీ సర్పం అనుకుంటే మనం పొరబడినట్టే. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాముల్లో ఇదీ ఒకటని అక్కడి జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాగా ఆకలేయడంతో కప్ప ఇలా చేసిందని వారు అంటున్నారు. పాముతో భీకర పోరాటం చేసి మరీ దాన్ని మింగేసిందట ఆ కప్ప. ఈ క్రమంలో పాము కప్పను పలుమార్లు కాటేసిందట. ఇవన్నీ తట్టుకుని కప్ప తన ఆకలి తీర్చుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 

Updated Date - 2020-02-10T15:05:58+05:30 IST