అన్నమో.. రామచంద్రా!

ABN , First Publish Date - 2020-03-29T11:35:19+05:30 IST

పొట్టచేత పట్టుకుని రాష్ట్రం దాటి ఖమ్మం వచ్చారు. ఇక్కడే గ్రానైట్‌ కంపెనీల్లో పని చేస్తూ పొట్టుపోసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నమో.. రామచంద్రా!

చేసేందుకు పని లేదు .. వెళ్లేందుకు దారిలేదు 

ఒడిశా గ్రానైట్‌ కార్మికుల ఆకలి కేకలు

రెండురోజులుగా పస్తులు .. పట్టించుకోని యజమానులు 


ఖానాపురంహవేలి, మార్చి 28: పొట్టచేత పట్టుకుని రాష్ట్రం దాటి ఖమ్మం వచ్చారు. ఇక్కడే గ్రానైట్‌ కంపెనీల్లో పని చేస్తూ పొట్టుపోసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. చేసేందుకు పని లేదు. వెళ్లేందుకు దారి లేదు. ఫలితంగా గ్రానైట్‌ కంపెనీల్లో పని చేసే ఒడిశా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తినేందుకు తిండి లేకపోవడంతో వారి గోస చెప్పనలవి కాకుండా ఉంది. ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా గ్రానైట్‌ పరిశ్రమలున్నాయి.  ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు.


లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు రెండురోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ర్టియల్‌ ఏరియా, కైకొండాయిగూడెంలో ఉన్న గ్రానైట్‌ టైల్స్‌ పరిశ్రమలో పనిచేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి సుమారు 200 మంది కార్మికులు పదేళ్లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పరిశ్రమలు మూతతో పని కరవైంది. మొ దట నాలుగురోజులు వారి వద్ద ఉన్న డబ్బులతో ఆహారపదార్థాలు కొనుక్కుని ఆకలి తీర్చుకున్నారు. రెండు రోజులుగా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆహా రం లేక పస్తులుంటున్నారు.


లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటినుంచి కొంతమందియజమానులు ఫ్యాక్టరీలకు రావడం మానేశారని, అవసరం ఉంటే ఫోన్లుచేస్తే ఎత్తడంలేదని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పరిశ్రమల యజమానులు ఇలాంటి పరిస్థితుల్లో మాకు అండగా ఉండకుండా ముఖం చాటేస్తున్నారని కార్మికులు ఆంధ్ర జ్యోతి ఎదుట వాపోయారు. కాగా గ్రానైట్‌ కార్మికులకు నవభారత్‌ వలంటీర్స్‌ సమాచారం మేరకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ రిషి కార్మికులకు బియ్యం, కూరగాయలతోపాటు కూరలలో ఉపయోగించే ఇతర సామగ్రిని అందించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి 20మదికి భోజనాలు ఏర్పాటు చేశారు. మరో దాత నెక్ట్స్‌ షోరూం రిలేషన్‌షి్‌ప మేనేజర్‌ శంకర్‌ ఐదు కిలోల మంచినూనె అందించారు. మున్ముందు కూడా కార్మికులు ఆదుకొనేందుకు ఎల్లప్పుడు ముందుంటామని నవభారత్‌ వలంటీర్లు రవి, వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2020-03-29T11:35:19+05:30 IST