అర్ధరాత్రి దాటాక హంగామా

ABN , First Publish Date - 2022-05-29T07:07:42+05:30 IST

జిల్లాలో గత రెండురోజులుగా మున్సిపాలిటీ ఉద్యోగ నియామకాల్లో చోటు చేసుకున్న అవినీతిపై అట్టుడుకుతుండగా పట్టణ కేంద్రం లో శనివారం ఉదయం అక్రమ వెంచర్లు, లే అవుట్లపై మున్సిపాలిటీ తొలగించే కార్యక్రమం చేపట్టింది.

అర్ధరాత్రి దాటాక హంగామా
వెంచర్లలో రాళ్లు తొలగిస్తున్న వాహనం

వెంచర్ల తొలగింపుపై ఉద్రిక్తత

అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులు

నిర్మల్‌ కల్చరల్‌, మే 28 : జిల్లాలో గత రెండురోజులుగా మున్సిపాలిటీ ఉద్యోగ నియామకాల్లో చోటు చేసుకున్న అవినీతిపై అట్టుడుకుతుండగా పట్టణ కేంద్రం లో శనివారం ఉదయం అక్రమ వెంచర్లు, లే అవుట్లపై మున్సిపాలిటీ తొలగించే కార్యక్రమం చేపట్టింది. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, రెవె న్యూ అధికారుల సహకారంతో గాజులపేట, డాక్టర్స్‌ కాలనీ, లంగ్డాపూర్‌ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు అక్రమవెంచర్లు చేస్తూ ప్లాట్లు అ మ్ముకుంటున్నారనే నెపంతో మున్సిపల్‌ శాఖ ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరో పణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ పారిశుద్ధ్య పోస్టులలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేయగా ఆయన తనఇంట్లో దీక్షచేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ నాయ కులు అధికారుల అండతో కాంగ్రెస్‌ మైనారిటీ నాయకులను టార్గెట్‌ చేసి వారి వెంచర్లపై దాడి చేసి తొలగించిందన్నది కాంగ్రెస్‌ నాయకుల ఆరోపణ.

ఉద్యోగ నియామకాలపై 

విచారణకు ఆదేశం కంటి తుడుపు చర్య

ఫ సిట్టింగ్‌జడ్జితో విచారణ జరపాలి  

ఫ  మంత్రి, చైర్మన్‌ను బర్తరఫ్‌ చేయాలి ఫ  బీజేపీ డిమాండ్‌

నిర్మల్‌ కల్చరల్‌, మే 28 : నిర్మల్‌ మున్సిపాలిటీ పబ్లిక్‌ హెల్త్‌పోస్టుల నియా మకంలో జరిగిన అవినీతిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి విచారణకు ఆదేశించడం కంటితుడుపు చర్యగా బీజేపీ అభివర్ణించింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్‌ శనివారం విడుదల చేసిన ప్రకటనలో మున్సిపల్‌ నియామకాలలో మంత్రి హస్తం ఉందని దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ ప్రకటన చేశారని పే ర్కొన్నారు. ప్రజల్లో వ్యతిరేకత పోగొట్టేందుకు చేసిన ప్రయత్నమే విచారణకు ఆదేశించడమన్నారు. ఉద్యోగాల నియామకంలో కలెక్టర్‌ కూడా బాధ్యుడేనని అ లాంటిది అదే కలెక్టర్‌తో విచారణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తక్ష ణం కలెక్టర్‌ను బదిలీ చేసిన సిట్టింగ్‌జడ్జి ద్వారా విచారణ చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ను పదవుల నుంచి ప్రభుత్వం బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-29T07:07:42+05:30 IST