కర్ఫ్యూ ఎత్తేయగానే కరోనా నిబంధనలు గాలికి.. వందలాది మంది కలిసి పార్టీలు!

ABN , First Publish Date - 2021-05-11T02:04:32+05:30 IST

కరోనా మహమ్మారితో నిన్నమొన్నటి దాకా తీవ్రంగా ఇబ్బందులు పడిన ఆ దేశంలో.. తాజాగా కర్ఫ్యూ తొలగించారు. అంతే ప్రజలంతా రోడ్లపైకి వచ్చేసి పార్టీలు చేసుకుంటూ కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు.

కర్ఫ్యూ ఎత్తేయగానే కరోనా నిబంధనలు గాలికి.. వందలాది మంది కలిసి పార్టీలు!

మాడ్రిడ్: కరోనా మహమ్మారితో నిన్నమొన్నటి దాకా తీవ్రంగా ఇబ్బందులు పడిన ఆ దేశంలో.. తాజాగా కర్ఫ్యూ తొలగించారు. అంతే ప్రజలంతా రోడ్లపైకి వచ్చేసి పార్టీలు చేసుకుంటూ కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. ఈ ఘటన స్పెయిన్ దేశంలో వెలుగు చూసింది. ఇక్కడ ఇన్నాళ్లూ విధించిన కరోనా కర్ఫ్యూను తాజాగా తొలగించారు. దీంతో ఇంతకాలం కరోనా నిబంధనలు పాటించిన ప్రజలు సడెన్‌గా వాటికి నీళ్లొదిలేసి పార్టీలు చేసుకున్నారు. గతేడాది అక్టోబరు 25 నుంచి ఇక్కడ కర్ఫ్యూ విధించే ఉంది. ఇది పూర్తి కాగానే రోడ్లెక్కిన ప్రజల్లో అత్యధికులు కనీసం మాస్కులు కూడా లేకుండా పార్టీ చేసుకున్నారు. సోషల్ డిస్టెన్సింగ్‌ అయితే సరేసరి. ఆరుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండకూడదన్న నిబంధన కూడా పోవడంతో అందరూ గుంపులు గుంపులుగా చేరి సంబరాలు చేసుకున్నారు. దేశంలో మొత్తం 17 రాష్ట్రాలు ఉండగా 13లో కర్ఫ్యూ ఎత్తేశారు.

Updated Date - 2021-05-11T02:04:32+05:30 IST