Advertisement
Advertisement
Abn logo
Advertisement

శతాధిక వృద్దురాలు గుండు పుల్లమ్మ మృతి

గరిడేపల్లి రూరల్‌, డిసెంబరు 2: మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రా మానికి చెందిన శతాధిక వృద్ధురాలు గుండు పుల్లమ్మ(105) గురువారం మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. ఆమె ఐదు తరాల కుటుంబ సభ్యులను చూసిందని పేర్కొన్నారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సుమారు 85మంది కుటుంబ సభ్యులను చూడటంతో పాటు ఎన్నో అపూర్వమైన సంఘటనలను, చూసిన ఘనత ఆమెది. ఆమె పుట్టినప్పటి నుంచి బ్రిటీష్‌ పరిపాలన, స్వాతంత్ర్యోద్యమం, ర జాకార్ల పాలన, నిజాం నవాబులు, ఆంధ్రప్రదేశ రాష్ట్ర అవతరణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వంటి ఎన్నో ఘటనలను చూసిన మహిళగా ఆమెకు పేరుంది. మొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి 17వ లోక్‌సభ ఎన్నికల వరకు దాదాపుగా ఓటు హ క్కును వినియోగించుకుంది. వారి పరిపాలన చూడగలిగింది. ఆమె మృతదేహానికి మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్‌ గౌడ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అ నంతరం జరిగిన ఆమె అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో గ్రామస్థులు తెలిపారు.  


Advertisement
Advertisement