నూరుశాతం బిల్లులు వసూలు చేయాలి

ABN , First Publish Date - 2022-08-11T05:46:24+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నూటికి నూరుశాతం బిల్లులు వసూలు చేయాలని విద్యుత్‌ శాఖ సీఎండీ రఘుమారెడ్డి ఆదేశించారు.

నూరుశాతం బిల్లులు వసూలు చేయాలి
మొక్క నాటి నీరుపోస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి

విద్యుత్‌శాఖ సీఎండీ రఘుమారెడ్డి 

నల్లగొండ, ఆగస్టు 10: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నూటికి నూరుశాతం బిల్లులు వసూలు చేయాలని విద్యుత్‌ శాఖ సీఎండీ రఘుమారెడ్డి ఆదేశించారు. బుధవారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని విద్యుత్‌ కార్యాలయంలో మూడు జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేయాలని, రోడ్డు విస్తరణ పనులు జరిగేటప్పుడు కరెంటు నిలిపివేసే విషయాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా సరఫరా ఆగిపోతే తక్షణమే అక్కడికి వెళ్లి పునరుద్ధరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 12గంటల్లోపు విద్యుత్‌ను పునరుద్ధరించాలన్నారు. స్టోర్స్‌ నుంచి సామగ్రిని తీసుకునే సమయంలో సంబంధిత ఏఈలు అక్కడే ఉండాలన్నారు. నిరూపయోగంగా ఉన్న సామగ్రిని స్టోర్స్‌కు తరలించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు శ్రీనివా్‌సరెడ్డి, మధన్‌మోహన్‌, రాములుతో పాటు భిక్షపతి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:46:24+05:30 IST