గంగమ్మ గుడిలో హుండీ దొంగతనం

ABN , First Publish Date - 2022-07-03T04:43:07+05:30 IST

చింతకొమ్మదిన్నె మండలం కొత్తపేట వద్ద గంగమ్మగుడి ఆలయంలో హుండీ దొంగతనం చేసిన ధర్మరాజును అరెస్టు చేసినట్లు సికెదిన్నె ఎస్‌ఐ శ్రీరామశ్రీనివాస్‌, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు.

గంగమ్మ గుడిలో హుండీ దొంగతనం
గంగమ్మ ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితునితో ఎస్‌ఐలు

నిందితుడి అరెస్టు - చోరీపై పలు అనుమానాలు

సికెదిన్నె, జూలై 2: చింతకొమ్మదిన్నె మండలం కొత్తపేట వద్ద గంగమ్మగుడి ఆలయంలో హుండీ దొంగతనం చేసిన ధర్మరాజును అరెస్టు చేసినట్లు సికెదిన్నె ఎస్‌ఐ శ్రీరామశ్రీనివాస్‌, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. ఆలయంలో ఉదయం 11.30 గంటలకు ధర్మరాజు రెండు హుండీల తాళం పగులకొట్టి ఒక హుండీలో రూ.5,940 నగదును దొంగలించాడు. ఆ సమయంలో హుండీ పగులకొట్టే శబ్ధం విని లోపలికి వచ్చి స్థానికుల సహాయంతో పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పూజారి బయటకు వెళ్లగా ఘటనపై ఆలయ ఈఓ సురే్‌షరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

దొంగతనంపై పలు అనుమానాలు

గంగమ్మ గుడి ఆలయంలో దొంగతనంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమౌతునట్లు తెలుస్తోంది. గంగమ్మ గుడి ఆలయం ఉదయం 11.30కు దొంగతనం జరిగింది. అయితే సోమవారం హుండీ లెక్కింపు ఉంటుందని మధ్యాహ్నం ఒక్కటిన్నరకు ఈఓ విలేకరుల కు సమాచారం అందించడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

ఆశ్రమంలో హుండీ చోరీ

రామాపురం, జూలై2: కేవలానంద లక్ష్మినారాయణ స్వామిజీ ఆశ్రమంలో శుక్రవారం రాత్రి హుండీ చోరీ అయినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. కడప- చిత్తూరు జాతీ య రహదారిపై మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆశ్ర మంలో హుండీ చోరీకి గురవడంతో రామాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిర్వా హకులు తెలిపారు.  గతంలో రెండు పర్యాయాలు చోరీ జరిగినట్లు తెలిపారు. 

Updated Date - 2022-07-03T04:43:07+05:30 IST