Advertisement
Advertisement
Abn logo
Advertisement

మానవ మనుగడపై North america లో సరికొత్త ఆధారం.. ఇప్పటివరకు అనుకున్నదంతా తప్పేనా..?

వాషింగ్టన్: మానవ మనుగడకు సంబంధించి అరుదైన, ఆశ్చర్యకరమైన ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉత్తర అమెరికాలోని న్యూ మెక్సికోలో 23వేల ఏళ్ల క్రితమే మానవులు జీవించినట్లు ఈ ఆధారాలు వెల్లడిస్తున్నాయి. మానవ మనుగడకు సంబంధించి తాము నిర్వహించిన పరిశోధనలో ఈ ఆధారాలు బయటపడ్డాయని బోర్నెమౌత్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇప్పటివరకు 13 నుంచి 16వేల ఏళ్ల క్రితమే అమెరికా నేలపై మానవ మనుగడ ప్రారంభమైందని ఆధారాలు లభించాయి. కానీ తాజాగా లభించిన ఆధారాలతో ఈ అంచనా తప్పని తేలినట్లైంది.

బ్రిటన్, అమెరికాలకు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు కలిసి నిర్వహించిన ఈ అధ్యయనంలో మెక్సికోలోని వైట్ శాండ్స్ నేషనల్ పార్క్‌లో ఉన్న అల్కలీ ఫ్లాట్ సరస్సులో ఓ రాయి లభించింది. ఆ రాయిపై మనుషుల కాలి ముద్రలు ఉన్నాయి. వాటిపై ఉన్న పై పొర, లోపలి పొరలను రేడియో కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధించిన అమెరికన్ జియోలాజికల్ సర్వే నిపుణులు.. అవి 23వేల ఏళ్లనాటివని తేల్చారు. అంతేకాదు.. ఒకప్పుడు నేషనల్ శాండ్స్ ప్రాంతం మొత్తం ఎడారి ప్రాంతంగా ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తూ వస్తున్నారు. అయితే ఈ కాలి ముద్రలు ఏర్పడిన కాలంలో ఇక్కడ పూర్తిగా నీటితో నిండి ఉండేదని తేలడంతో శాస్త్రవేత్తలకు మరో షాక్ తగిలినట్లైంది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement