పోలీసుల మానవత్వం..

ABN , First Publish Date - 2021-05-12T05:11:57+05:30 IST

కేశుపురంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్థులు ముందుకు రాకపోవడంతో కాశీబుగ్గ సీఐ ఎస్‌.శంకరరావు ఆధ్వర్యంలో పోలీ సులు ఆ మృతదేహాన్ని ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులే బంధువులుగా వ్యవహరించారు. కొద్దిరోజుల కిందట అప్పటి కాశీబుగ్గ ఎస్‌ఐ శిరీష అనాథ శవాన్ని మోసి కర్మకాండలు నిర్వహించిన సంఘటన మరువక ముందే అదే తరహాలో సీఐ శంకరరావు చూపించిన తెగువ పలువురి ప్రశం సలు అందుకున్నారు.

పోలీసుల మానవత్వం..
మృతదేహాన్ని పూడ్చిపెడుతున్న పోలీసులు, పరిశీలిస్తున్న సీఐ

మృతదేహం ఖననం

ముందుకు రాని గ్రామస్థులు 

పలాస రూరల్‌:  కేశుపురంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్థులు ముందుకు రాకపోవడంతో కాశీబుగ్గ సీఐ ఎస్‌.శంకరరావు ఆధ్వర్యంలో పోలీ సులు ఆ మృతదేహాన్ని ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులే బంధువులుగా వ్యవహరించారు. కొద్దిరోజుల కిందట అప్పటి కాశీబుగ్గ ఎస్‌ఐ శిరీష  అనాథ శవాన్ని మోసి కర్మకాండలు నిర్వహించిన సంఘటన మరువక ముందే అదే తరహాలో సీఐ శంకరరావు చూపించిన తెగువ పలువురి ప్రశం సలు అందుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కేశుపురానికి చెందిన బమ్మిడి చల పతి రావు(35) గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనతో పాటు తల్లి మహాలక్ష్మి నివాసముంటోంది. పొలం పనులు ముగించుకొని సోమవారం రాత్రి ఇంటికి వచ్చి నిద్రించిన ఆయనకు మంగళవారం ఉదయం తల్లి నిద్ర లేపగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి గ్రామస్థులకు విషయం తెలిపింది. కరోనా విజృంభి స్తున్న సమయంలో ఆయన మృతి చెందగా గ్రామస్థులెవరూ ముందుకురాలేదు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శంకర రావు, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించి ముంద జాగ్రత్తగా సిబ్బందితో పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు. 

 


 

Updated Date - 2021-05-12T05:11:57+05:30 IST