Advertisement
Advertisement
Abn logo
Advertisement

కులం, మతం కంటే మానవత్వం గొప్పది

కడ్తాల్‌ : కులం, మతం కంటే మానవత్వం గొప్పదని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ శాంతి కోసం దైవచింతనతో ముందకు సాగాలని ఆయన కోరారు. భైరాపూర్‌ గ్రామ సమీపంలోని సైదులు బాబా దర్గాను  బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి పాతేహాలు సమపర్పించారు. అనంతరం లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ సన్మార్గంతోనే దైవానుగ్రహం లభిస్తుందని అన్నారు. కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్‌ లాయక్‌అలీ, ఉప సర్పంచ్‌ కడారి రామకృష్ణ, నాయకులు బాచిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, బిక్షపతి, మల్లయ్య, గణేశ్‌, గంప శ్రీను, అశోక్‌, కృష్ణ, దాసు, సురేశ్‌, మహేశ్‌, యాదయ్య, జంగయ్య, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement