మానవతా సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2020-03-31T10:12:25+05:30 IST

లాక్‌డౌన్‌తో ఇబ్బందు లు పడుతున్న నిరుపేదలు, నిరాశ్రయులకు సేవలు అందించి మానవతా విలువలు

మానవతా సేవలు మరువలేనివి

మాస్కులు, పానీయాలు, కార్మికులకు యూనిఫాం పంపిణీ


రాయచోటిటౌన్‌, మార్చి 30: లాక్‌డౌన్‌తో ఇబ్బందు లు పడుతున్న నిరుపేదలు, నిరాశ్రయులకు సేవలు అందించి మానవతా విలువలు కాపాడుతున్నారు. అధికారులు, ప్రజప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా రాయచోటి లో 100 మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి.. ఒక్కో కుటుంబానికి రూ.1500 విలువైన నిత్యావసర సరుకులను పీరాన్‌సాహెబ్‌ అండ్‌ ఫాతిమాబీ మెమో రియల్‌ ట్రస్టు సెక్రటరీ జలాలుద్దీన్‌ ఆధ్వర్యంలో అంద జేశారు.


ట్రస్టు చైర్మెన్‌ నాజియాబేగం, సభ్యులు కిశోర్‌, అజీముద్దీన్‌, జాఫర్‌, మహమ్మద్‌అలీ, మహమ్మద్‌ ఆసీఫ్‌, ఎస్టీయూ మండల అధ్యక్షుడు మున్వర్‌బాషా, సునీర్‌  ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఏప్రిల్‌ 14వరకు రాయుడు కాలనీ, పాతరాయచోటి, కొత్తపల్లె, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. యర్రగుంట్ల ఎస్సీ కాలనీలో సాంబశివారెడ్డి ఆర్థిక సాయంతో రాయచోటి లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో 59 కుటుంబాలకు  కూరగాయలు పంపిణీ చేశారు.


ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా చారిటబుల్‌ ట్రస్ట్‌చే సోమవారం నుంచి అన్న దానం చేశారు.   విధినిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది, పోలీసుల సౌకర్యార్థం దిరాయచోటి కో-ఆపరే టివ్‌ కాలనీ సొసైటీ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్‌ దశరథరామిరెడ్డి తయారు చేయించిన మాస్కులను డిప్యూటీ తహసీల్దార్‌ నరసింహకుమార్‌కు అందజేశారు. 

Updated Date - 2020-03-31T10:12:25+05:30 IST