మానవ అక్రమ రవాణా నిరోధించాలి

ABN , First Publish Date - 2021-02-26T05:22:27+05:30 IST

జిల్లాలో మానవ అక్రమరవాణా నిరోధించేందుకు సమ న్వయంతో పనిచేయాలని ఏఎస్పీ రాంరెడ్డి అన్నారు.

మానవ అక్రమ రవాణా నిరోధించాలి
గోడప్రతులు విడుదల చేసిన ఏఎస్పీ రాంరెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 25 : జిల్లాలో మానవ అక్రమరవాణా నిరోధించేందుకు సమ న్వయంతో పనిచేయాలని ఏఎస్పీ రాంరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫింగ్‌ యూనిట్‌ కో-ఆర్డినేషన్‌ సమావేశం జరిగింది. మానవ అక్రమ ర వాణా నిరోధానికి ఉమ్మడి కార్యచరణపై దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలతో కలిసి అక్రమ రవాణా నిరోధానికి ముందుకు వెళ్లాలన్నారు. అక్రమరవాణా నిరోధించడం అంతకష్టతరం కాదన్నారు. మహిళలు, చిన్నపిల్లల్ని రెస్క్యూచేసే సమయంలో అన్ని జాగ్రత్తలు వహించా లన్నారు. నిందితులపై కేసు నమోదు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలు తీసుకోవాలని, ఇంటి యజమా నులను సాక్షిగా పెట్టాలన్నారు. రెస్క్యూ చేసిన మహిళలు, పిల్లల పూర్తి బయోడేటా సేకరించాలని సూచించారు. బాధితులకు సఖి సెంటర్‌, లేదా సీడబ్ల్యూసీ సెంటర్‌లో కోర్టులోసాక్ష్యం చెప్పే విధంగా కౌన్సిలింగ్‌ నిర్వహించాలన్నారు. మైనర్‌ పిల్లల కేసుల్లో అక్రమరవాణా కేసులలో నేరస్థులకు శిక్షపడితే నేరాలు తగ్గుతా యన్నారు. డీఈవో ప్రణీత, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి స్రవంతి, ముధోల్‌ సీఐ అజయ్‌బాబు ఈ అంశాలపై మాట్లాడారు. 

Updated Date - 2021-02-26T05:22:27+05:30 IST