జీవ వైవిద్యంతోనే మనుషుల మనుగడ డిప్యూటీ సీఎం అంజద్‌బాష

ABN , First Publish Date - 2022-05-23T05:11:45+05:30 IST

మానవ జాతి మనుగడ, జీవ వైవి ద్య పరిరక్షణపై ఆధారపడి ఉందని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు.

జీవ వైవిద్యంతోనే మనుషుల మనుగడ  డిప్యూటీ సీఎం అంజద్‌బాష
అవార్డులు పొందిన సంస్థల ప్రతినిధులు

కడప వైవీయూ, మే 22: మానవ జాతి మనుగడ, జీవ వైవి ద్య పరిరక్షణపై ఆధారపడి ఉందని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. ఆదివారం వైవీయూలో ఆంధ్రప్రదేశ్‌ జీవ వైవిద్య మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవం సందర్భంగా సంస్థ జీవరాసుల మనుగడకు భాగస్వా మ్య భవిష్యత్తును నిర్మించడం అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేస్తున్నందున వ్యాధుల తీవ్రత పెరుగుతుందన్నారు. సంప్రదాయ ఎరువులను వినియోగించాల్సిన అవస రం ఉందన్నారు.

జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ రైతులు సంప్రదాయక ఎరువులతో వ్యవసా యం చేసి జీవరాశులను కాపాడేవారన్నారు. వీసీ సూర్యకళావతి మాట్లాడుతూ వైవీయూకు రాష్ట్రస్థాయి బయోడైవర్సిటీ అవార్డు, గ్రీనరీ అవార్డు రెండు దఫాలుగా అందాయన్నారు. వైవీయూలో మూడు లక్షలు మొక్కలు పెరుగుతున్నాయని, 20 ఎకరాల్లో బొటానికల్‌ గార్డెన్‌ అభివృద్ధి జరుగుతోందన్నారు. బయోడైవర్సిటీ బోర్డు కార్యదర్శి డాక్టర్‌ నళినీమోహన్‌ జీవ వైవిద్య పరిరక్షణ చట్టం ఆవశ్యకతపై విశ్లేషించారు. ఏపీ జీవ వైవిద్య మండలి ఛైర్మన్‌ బీఎన్‌కే రెడ్డి సీఎం సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, ఎన్‌ఎ్‌సఎస్‌ సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. 

సంరక్షణ పురస్కారాలు ఇలా...

డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ హార్టీకల్చరల్‌విశ్వవిద్యాలయం వెస్ట్‌గోదావరి శ్రీ వెంకటేశ్వర వెటర్నిటీ యూనివర్సిటీ తిరుపతి, ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌ లైవ్‌స్టాక్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ గుంటూరు, కమిషనర్‌ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ, తాడేపల్లె, గుంటూరు, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ బాటనీ విభాగం అనంతపురం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎన్వీరాన్‌మెంట్‌ సైన్స్‌ బాట నీ విభాగం, గుంటూరు, డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ చెన్నై, ఈ-ప్రగతి అథార్టీ విజయవాడ, ఫారెస్టు డిపార్టుమెంట్‌ టీటీడీ తిరుపతి అవార్డులు పొందారు. 

Updated Date - 2022-05-23T05:11:45+05:30 IST