రాజమండ్రి(Rajahmundry): మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission)కు వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నామని మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి (Justice Seetharama Murthy)అన్నారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో మానవ హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కాకినాడ(Kakinada)లో నిర్వహించిన విచారణలో 20 కేసులు పూర్తి స్థాయిలో పరిష్కరించామన్నారు. పోలీస్, రెవెన్యూశాఖలపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. బాధితుల వద్దకే వెళ్ళి విచారణ చేపట్టే విధంగా వివిధ ప్రాంతాల్లో క్యాంప్ సిట్టింగ్లు నిర్వహిస్తున్నామని జస్టిస్ సీతారామమూర్తి తెలిపారు.
ఇవి కూడా చదవండి