తీరానికి భారీ తిమింగళం

ABN , First Publish Date - 2022-02-25T01:32:48+05:30 IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినకొత్తూరు తీరానికి భారీ తిమింగళం కొట్టుకొచ్చింది. గురువారం ఉదయం సుమారు

తీరానికి భారీ తిమింగళం

వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినకొత్తూరు తీరానికి భారీ తిమింగళం కొట్టుకొచ్చింది. గురువారం ఉదయం సుమారు 400 కిలోల బరువు ఉండే తిమింగళం తీరంలో కనిపించింది. స్థానిక మత్స్యకారులు, యువకులు గమనించి తిమింగళాన్ని తిరిగి సముద్రంలో నెట్టివేశారు. దీంతో ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్లిపోయింది. కొద్దిరోజుల కిందట ఓ తిమింగళం తీరానికి చేరి మృత్యువాత పడింది. ఇప్పుడు ఈ భారీ తిమింగళం తిరిగి సముద్రంలోకి వెళ్లడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2022-02-25T01:32:48+05:30 IST