మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. లాక్డౌన్ తర్వాత సినిమా షూటింగ్ పునః ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు హైదరాబాద్‌లో.. 16 ఎకరాల్లో రూ.20 కోట్లు ఖర్చు పెట్టి ఓ భారీ సెట్‌ను వేస్తున్నారట. ఈ సెట్లో మేజర్ షెడ్యూల్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. ఇంతకు ముందు షెడ్యూల్లో కూడా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుడి సెట్ వేసి చిత్రీకరణ చేశారు. చిరంజీవి ఈ చిత్రంలో మాజీ నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా, రామ్‌చరణ్ నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నారని టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. దేవాదాయశాఖలో జరిగే అవినీతిని ప్రశ్నించేలా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రూపొందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.