సెర్చ్‌, యూట్యూబ్‌ నుంచి గూగుల్‌కు భారీ ఆదాయం

ABN , First Publish Date - 2021-07-31T06:16:59+05:30 IST

సెర్చ్‌, యూట్యూబ్‌తో గూగుల్‌ ఆదాయం భారీగా పెరిగింది. క్వార్టర్లీ ఫలితాల్లో కనిపించిన అంకెలు ఈ విషయాన్ని రూడిపరుస్తున్నాయి. 61.9 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని గడించినట్లు సంస్థ వెల్లడించింది.

సెర్చ్‌, యూట్యూబ్‌ నుంచి గూగుల్‌కు భారీ ఆదాయం

సెర్చ్‌, యూట్యూబ్‌తో గూగుల్‌ ఆదాయం భారీగా పెరిగింది. క్వార్టర్లీ ఫలితాల్లో కనిపించిన అంకెలు ఈ విషయాన్ని రూడిపరుస్తున్నాయి. 61.9 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని గడించినట్లు సంస్థ వెల్లడించింది. నాలుగో క్వార్టర్‌లో వరుసగా 18.5 బిలియన్‌ డాలర్ల మేర నికర లాభాన్ని గడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ కార్యకలాపాలు పెరగడంతో తమ సేవలు ద్వారా వీరంతా సులువుగా పనులు చేసుకోగలుతున్నారని గూగుల్‌ సిఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ఏఐ, గూగుల్‌ క్లౌడ్‌లో తాము చేసిన కృషి కారణంగానే వినియోగదారులు తమ డిజిటల్‌ పనులు సులువుగా చేసుకోగలుగుతున్నారని ఆయన చెప్పారు. గూగుల్‌ సెర్చ్‌ 35.8 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. మునుపటి సంవత్సరం కంటే 14 బిలియన్‌ డాలర్లు ఎక్కువ. యూట్యూబ్‌ ప్రకటనల ఆదాయం గత ఏడాది 3.8 బిలియన్‌ డాలర్లు కాగా ఈ సంవత్సరం ఏడు బిలియన్‌ డాలర్లతో దాదాపుగా రెట్టింపుగా రికార్డయింది. యూట్యూబ్‌ షార్ట్‌ల డైలీ వీక్షణ మార్చిలో  6.5 బిలియన్లు కాగా ఇప్పుడది 15 బిలియన్లుగా నమోదైంది.

Updated Date - 2021-07-31T06:16:59+05:30 IST