Amaravathi: ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-08-10T04:07:30+05:30 IST

భారీ వర్షాల దృష్ట్యా ఎగువ నుంచి గోదావరి (Godavari)కి వరద నీరు వస్తోందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ...

Amaravathi: ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక ప్రకటన

అమరావతి (Amaravathi): (Huge Rains) భారీ వర్షాల దృష్ట్యా ఎగువ నుంచి గోదావరి (Godavari)కి వరద నీరు వస్తోందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (AP Disaster Management Agency) హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి, తూ.గో., కోనసీమ, కాకినాడ, ఏలూరు, భీమవరం జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ధవళేశ్వరం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 7.74 లక్షల క్యూసెక్కులు ఉందని.. గోదావరి పరివాహక వాసులు జాగ్రత్తలు పాటించాలని వివరించింది. బోట్‌లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించద్దని హెచ్చరించింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం ప్రమాదకరమని వెల్లడించింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా వరద నీరు దిగువకు విడుదల చేసినట్లు పేర్కొంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వాసులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. 


Updated Date - 2022-08-10T04:07:30+05:30 IST