చైనాలో భారీ వర్షం.. వరదల బీభత్సం

ABN , First Publish Date - 2020-07-03T03:39:45+05:30 IST

చైనాలో భారీగా వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. లోతట్టుప్రాంతాలన్నీ మునిగిపోయాయి..

చైనాలో భారీ వర్షం.. వరదల బీభత్సం

చైనాలో భారీగా వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. లోతట్టుప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ప్రధాన రహదారులు కోతకు గురయ్యాయి.  ప్రధానంగా హుబీ ప్రావిన్స్‌లో భారీ నష్టం జరిగింది. 22 నగరాలపై వరదల ప్రభావం చూపింది. లక్షల సంఖ్యలో నిర్వాసితులు నిరశ్రాయులుగా మిగిలిపోయారు. రెస్క్యూటీమ్‌లు సహాయక చర్యలు అందించాయి. వరదల కారణంగా పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. వరదలకు దెబ్బతిన్న లక్షకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. 

Updated Date - 2020-07-03T03:39:45+05:30 IST