Abn logo
Sep 16 2020 @ 21:19PM

హైదరాబాద్‌ రోడ్లపై మోకాల్లోతు నీళ్లు.. తీవ్ర ఇక్కట్లు

హైదరాబాద్‌: నగరంలో కురిసిన భారీ వర్షానికి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో రోడ్లపై నీళ్లు చెరువులను తలపించేలా నిలిచిపోయాయి. చాలా చోట్ల వాహనాలు నీళ్లలో చిక్కుకుపోయాయి. మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్లు, ఆటోలు, లారీలు నీళ్లలో  నిలిచిపోయాయి. ద్విచక్రవాహనాలైతే నీటి ఉధృతిలో కొట్టుకుపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదు

  • అత్యధికంగా అత్తాపూర్ 10.4, షేక్‌పేట్ 10.3, మణికొండ 9.8 సెం.మీ. వర్షపాతం నమోదు 
  • ఫిలింనగర్ 9.7, రాజేంద్రనగర్ 9.6, టోలిచౌకి 9.6, గండిపేట్ 9.4 సెం.మీ. వర్షపాతం
  • ఉప్పల్, శ్రీనగర్ కాలనీ, శేరిలింగంపల్లిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • అబ్దుల్లాపూర్‌మెట్ 8.8, షేక్‌పేట్ 8, ఆసిఫ్‌నగర్ 7.5 సె.మీ. వర్షపాతం

Advertisement
Advertisement
Advertisement