టమోటాకు భారీ ధర

ABN , First Publish Date - 2021-11-15T23:37:53+05:30 IST

జిల్లాలో టమోటా పంటకు భారీ ధర పెరిగింది. పత్తికొండ

టమోటాకు భారీ ధర

కర్నూలు: జిల్లాలో టమోటా పంటకు భారీ ధర పెరిగింది. పత్తికొండ మార్కెట్ యార్డ్‌లో రికార్డుస్థాయిలో టమోటాకు ధర పలికింది. కిలో టమోటా 72 రూపాయలకు అమ్ముడుపోయింది. టమోటా గంపల ధర 3,250 రూపాయలు పలికింది. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని అధిక రేటుకు టమోటాను వ్యాపారులు కొనుగోలు చేశారు. టమోటాకు మంచి రేట్లు రావడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు టమోట తక్కువ రావడంతోనే అధిక ధర పలికిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి టమోటా దిగుబడులు తగ్గాయి. 


Updated Date - 2021-11-15T23:37:53+05:30 IST