ఫ్లోరిడాలో వింత ఘటన.. తలలు పట్టుకున్న పోలీసులు!

ABN , First Publish Date - 2021-05-21T21:57:44+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలియక పోలీసులు సైతం తలలు పట్టకుంటున్నారు. కాగా.. ప్రస్తుతం ఆ వింత ఘటనకు సంబంధించి

ఫ్లోరిడాలో వింత ఘటన.. తలలు పట్టుకున్న పోలీసులు!

ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలియక పోలీసులు సైతం తలలు పట్టకుంటున్నారు.  కాగా.. ప్రస్తుతం ఆ వింత ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆకాశంలో మబ్బు పట్టకుండానే, వర్షం జాడ కూడా లేకుండానే ఓ భారీ సైజు మంచు ముక్క ఆకాశం నుంచి అకస్మాత్తుగా పడి, ఇంటికి చిల్లు పెట్టిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటు చేసుకుంది. పామ్ నగరంలోని ఓ ఇంటిపై ఆకాశం నుంచి ఉన్నట్టుండి భారీ పరిమాణం ఉన్న మంచు ముక్క పడటంతో ఆ ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.



 దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ మంచు ముక్కకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా ‘ఆకాశం నుంచి అంతపెద్ద ఐస్‌ముక్క ఎలా పడింతో అర్థం కావడం లేదు. మంచు ముక్క.. ఇంటి మీద పడటం వల్ల రూఫ్ దెబ్బతింది. అయితే ఎవరికీ ఎటువంటి హానీ కలగలేదు’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ మంచు ముక్కకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2021-05-21T21:57:44+05:30 IST