Jul 7 2021 @ 08:14AM

'గని' ఆడియో రైట్స్‌కి భారీ ఆఫర్

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'గని'. ఈ చిత్ర ఆడియో రైట్స్‌కి భారీ ఆఫర్ వచ్చిందని సమాచారం. కిరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో వరుణ్‌కి జంటగా సాయీ మంజ్రేకర్ నటిస్తోంది. జగపతిబాబు, నదియా, నవీన్ చంద్ర, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన వరుణ్ తేజ్ పోస్టర్స్ భారీ అంచనాలు పెంచాయి. దాంతో 'గని' చిత్ర డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్‌ను ఇప్పటికే 'ఆహా' వీడియో 24 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇక తాజాగా ఆడియో రైట్స్ ను లహరి మ్యూజిక్ 1.5 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు విక్టరీ వెంకటేశ్‌తో కలిసి 'ఎఫ్ 3'లోనూ నటిస్తున్నాడు.