Advertisement
Advertisement
Abn logo
Advertisement

Dubai నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు.. అనుమానంతో తనిఖీ చేసిన ఎయిర్‌పోర్టు అధికారులకు షాక్

ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్‌రూరల్‌, డిసెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. దుబాయ్‌ నుంచి ఎయిర్‌ ఇండియా 951 విమాన సర్వీసులో ఇద్దరు ప్రయాణికులు విదేశీకరెన్సీని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఆ విమానం రాగానే ప్రయాణికులను తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద అరేబియన్‌ రియాల్, యూఏఈ ధీరమ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. కరెన్సీ విలువ రూ.17.7లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లభించిన కరెన్సీని సీజ్‌ చేసి, నిందితులను అరెస్టుచేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement