ఇంట్లో అతిపెద్ద నాగుపాము ప్రత్యక్షం

ABN , First Publish Date - 2020-08-13T13:30:27+05:30 IST

ఓ ఇంట్లో అత్యంత విషపూరితమైన తాచుపాము ప్రత్యక్షమైన ఘటన....

ఇంట్లో అతిపెద్ద నాగుపాము ప్రత్యక్షం

నైనిటాల్ (ఉత్తరాఖండ్): ఓ ఇంట్లో అత్యంత విషపూరితమైన తాచుపాము ప్రత్యక్షమైన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది. నైనిటాల్ నగరంలోని ఓ ఇంట్లో టేబుల్ కింద అతిపెద్ద పాము కనిపించింది. పామును చూసిన కుటుంబసభ్యులు అటవీశాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంకు సమాచారం అందించారు. దీంతో నైనిటాల్ అటవీశాఖ అధికారి ఆకాష్ కుమార్ వర్మతోపాటు వాలంటీర్ వచ్చి అత్యంత చాకచక్యంగా విషనాగును పట్టుకొని సంచిలో బంధించారు. అనంతరం పామును అటవీప్రాంతంలో వదిలేశారు. అతిపెద్ద పామును పట్టుకొని వదిలేసిన వీడియోను చిత్రీకరించిన డీఎఫ్ఓ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. 

Updated Date - 2020-08-13T13:30:27+05:30 IST