యూకో బ్యాంకు లాభంలో భారీ వృద్ధి

ABN , First Publish Date - 2022-02-01T06:53:34+05:30 IST

ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.310.40 కోట్ల లాభం ఆర్జించింది.

యూకో బ్యాంకు లాభంలో భారీ వృద్ధి

కోల్‌కతా: ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.310.40 కోట్ల లాభం ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.35.44 కోట్లతో పోల్చితే లాభం 775 శాతం పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 25.26 శాతం వృద్ధితో రూ.1762.60 కోట్లకు చేరిందని బ్యాంక్‌ సీఈఓ, ఎండీ సోమశంకర  ప్రసాద్‌ తెలిపారు. అన్ని విభాగాల్లోనూ బ్యాంకు మెరుగైన పనితీరు ప్రదర్శించిందన్నారు. త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్‌ అంతర్జాతీయంగా 3.03 శాతం ఉండగా దేశీయంగా 3.14 శాతం ఉన్నట్టు తెలిపారు. స్థూల ఎన్‌పీఏలు 9.8 శాతం నుంచి 8 శాతానికి తగ్గాయి. ఎన్‌పీఏల ప్రావిజన్‌ కవరేజి నిష్పత్తి 91.3 శాతం ఉంది. 

Updated Date - 2022-02-01T06:53:34+05:30 IST