‘యాదాద్రి’కి భారీగా విరాళాల అందజేత

ABN , First Publish Date - 2021-10-29T05:07:31+05:30 IST

‘యాదాద్రి’కి భారీగా విరాళాల అందజేత

‘యాదాద్రి’కి భారీగా విరాళాల అందజేత
ఘట్‌కేసర్‌ నుంచి విరాళాలతో ర్యాలీగా యాదాద్రికి తరలివెళ్తున్న మంత్రి మల్లారెడ్డి, తదితరులు

  • రూ.1.83కోట్లు పోగుచేసిన  ప్రజాప్రతినిధులు, నాయకులు 
  • ర్యాలీగా తరలివెళ్లి ఆలయ అధికారులకు అప్పగించిన మంత్రి మల్లారెడ్డి

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి)మేడ్చల్‌/ఘట్‌కేసర్‌/కీసర రూరల్‌  : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం భారీగా విరాళాలు సమకూరాయి. మేడ్చల్‌ నియోజకవర్గంలోని మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, పంచాయతీల పాలక వర్గాలు తాపడం కోసం అవసరమైన మూడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.1.83కోట్ల విరాళాన్ని గురువారం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులకు అప్పగించారు. కాగా, అంతకుముందు ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రికి విరాళాలను అందజేశారు. అనంతరం విరాళాల నగదును నర్సింహస్వామి చిత్రపటం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. నగదును ప్రత్యేక పళ్లెం(గంగాళం)లో పెట్టుకొని క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాన రోడ్డు వరకు ర్యాలీగా తరలి అనంతరం యాదాద్రి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు నాయకులు, ప్రజాప్రతినిధులు విరాళాలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, వైస్‌ చైర్మన్లు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కీసర మండలం, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల ప్రజాప్రతినిఽధులు, నాయకులు విరివిగా విరాళాలు అందజేసారు. కీసర మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి రూ.20లక్షలు, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల నుంచి రూ.10.85లక్షలు సమకూరాయి. కార్యక్రమంలో నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్మన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత, కీసర ఎంపీపీ ఇందిర, సింగిల్‌ విండో చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ కీసర మండలాధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, నాయకుడు నాయకపు వెంకటేష్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మేడ్చల్‌ యాదాద్రి గోపురం బంగారం తాపడానికి మేడ్చల్‌ మండలం నుంచి సేకరించిన విరాళాలను టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు దయానంద్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు సేకరించిన రూ.5,41,311 లక్షల విరాళంను మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందరెడ్డి, సొసైటీ చైర్మన్‌ రణదీ్‌పరెడ్డి, సురే్‌షరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాములు, భాగ్యారెడ్డి, రాజమల్లారెడ్డి, అశోక్‌, కృష్ణ, రఘుపతిరెడ్డి, భూపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:07:31+05:30 IST