Abn logo
Apr 17 2021 @ 00:48AM

మొక్కజొన్నలకు భారీ డిమాండ్‌

రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

సంతోషంలో మొక్కజొన్న పండించిన అన్నదాతలు

నిర్మల్‌ అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 16 : ఈ యాసంగి సీజన్‌లో మొక్కజొన్నలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. రాష్ట్రంలో గతంలో పండించిన మొక్కజొన్న నిల్వలు పేరుకు పోయాయని, ఈ యాసంగి సీజన్‌లో రైతులు మొక్కజొన్న సాగుచేయవద్దని ప్ర భుత్వం సూచించడం, ఒకవేళ సాగుచేసినా ప్రభుత్వం కొనుగోలు చేయదని ప్రక టించడంతో రాష్ట్రంలో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లారు. కాగా జిల్లాలో మాత్రం దాదాపు 45 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట సాగు చేశారు. ఇతర రాష్ర్టాల్లో మొక్కజొన్నసాగు తగ్గడంతో అక్కడి వ్యాపారులు రైతుల పంటచేల వద్దకు వెళ్లి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతు లు సంతోషిస్తున్నారు.

పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ

మొక్కజొన్నసాగుకు పెట్టుబడి తక్కువగా ఉండడంతో పాటు కూలీల అవసరం అంతగా లేకపోవడంతో రైతులు మొక్కజొన్నసాగుకు శ్రద్ద చూపుతున్నారు. అలా గే ఎకరానికి 40 నుండి 45 క్వింటాళ్ల దిగుబడి రావడం, పశువులకు గ్రాసం కూడా లభ్యమవుతుండడంతో రైతులుసాగుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే వ్యాపారులు క్వింటాల్‌కు రూ. 1400 నుండి 1500 వరకు చెల్లిస్తుండడంతో ఎక రానికి దాదాపు రూ.60 వేల వరకు ఆదాయం వస్తుండడం వల్ల రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్‌లో మొక్కజొన్న పండించిన రైతు లు సంతోషంగా ఉన్నారు. 


Advertisement
Advertisement