ఢిల్లీలో భారీగా మందుల నిల్వలు.. సీజ్ చేయాలని ఆదేశించిన హైకోర్టు..

ABN , First Publish Date - 2021-05-13T02:25:27+05:30 IST

ఢిల్లీలో ప్రభుత్వ ఆస్పత్రులకు ఉద్దేశించిన మందులు పెద్ద ఎత్తున నిల్వచేసినట్టు ఇవాళ ఓ లా విద్యార్ధి ఢిల్లీ హైకోర్టు దృష్టికి...

ఢిల్లీలో భారీగా మందుల నిల్వలు.. సీజ్ చేయాలని ఆదేశించిన హైకోర్టు..

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఆస్పత్రులకు ఉద్దేశించిన మందులను పెద్ద ఎత్తున డంప్ చేసినట్టు ఇవాళ ఓ లా విద్యార్ధి ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మెహ్రౌలీ-గుర్గావ్ రోడ్డులోని జైన దేవాలయం అహింసా స్థల్ సమీపంలో ఈ డంప్ ఉన్నట్టు లా విద్యార్ధి సాగర్ మెహ్లావత్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల కోసం ఉద్దేశించినట్టు మందులపై స్టాంపులు ఉన్నట్టు ఆయన తెలిపారు. దీంతో వెంటనే ఆ మందుల నిల్వలను సీజ్ చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిన ధర్మాసనం.. ఈ లోగా మందుల నిల్వలపై తీసుకున్న చర్యలకు సంబంధించి స్టేటస్ రిపోర్టును కూడా సమర్పించాలని ఆదేశించింది. ఆస్పత్రుల్లో బెడ్లు, మందుల కొరత, వైద్య సామగ్రి బ్లాక్ మార్కెటింగ్ సహా కరోనా సంబంధిత పిటిషన్లపై విచారణ జరుపుతున్న సందర్భంగా సాగర్ మెహ్లావత్ ఈ వ్యవహారాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అందులో కొన్ని కాలం చెల్లిన మందులు కూడా ఉన్నాయనీ.. మరికొన్ని గడువు ముగియనివి కూడా ఉన్నాయని సాగర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగపడే మందులను వాడటం మంచిదని ఆయన నివేదించారు. 


Updated Date - 2021-05-13T02:25:27+05:30 IST