Jammu and Kashmirలో భారీ ఆయుధాల డంప్ స్వాధీనం

ABN , First Publish Date - 2022-04-19T17:53:44+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం భారీ ఆయుధాల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....

Jammu and Kashmirలో భారీ ఆయుధాల డంప్ స్వాధీనం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం భారీ ఆయుధాల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.హజామ్ మొహల్లా వద్ద భారత సైనికులతో కలిసి కుప్వారా పోలీసులు జరిపిన సోదాల్లో భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.10 పిస్టల్స్, 17 పిస్టల్ మ్యాగజైన్లు, 54 పిస్టల్ రౌండ్లు, 5 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో  ఈ ఆయుధాలు దొరికాయని జమ్మూ కాశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు.ఆయుధాల స్వాధీనంపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టామని ఐజీ తెలిపారు.ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరిహద్దుల నుంచి అక్రమంగా రవాణా చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద సంస్థల్లో చేరిన కొత్త వారికి ఈ ఆయుధాలను పంపిణీ చేసేందుకు ఉగ్రవాదులు దాచి పెట్టారని భావిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.


Updated Date - 2022-04-19T17:53:44+05:30 IST