Abn logo
May 8 2020 @ 12:11PM

ఆరు నిమిషాల‌కు ఆరు కోట్ల రూపాయలు..?

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మూడో చిత్రం ‘పుష్ప‌’. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నారట. ఆయ‌న‌పై ఓ భారీ యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రిస్తార‌ని, అందుకోసం టాప్ మోస్ట్ యాక్ష‌న్ మాస్ట‌ర్స్ ప‌నిచేయ‌నున్నారని  ఇటీవల సోషల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే తాజా స‌మాచారం మేర‌కు సుక్కు ఆరు నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ స‌న్నివేశం కోసం ఆరు కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌ను ఖ‌ర్చు పెట్ట‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో తెరెక్కించ‌బోతున్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్క‌నుంది. 

Advertisement
Advertisement
Advertisement