భారీగా హుక్కా సామగ్రి స్వాధీనం

ABN , First Publish Date - 2022-07-25T17:19:34+05:30 IST

హుక్కా పార్లర్‌ నిర్వాహకుడితోపాటు మరో యువకుడ్ని సీసీఎస్‌ వెస్ట్‌జోన్‌ బృందం అదుపులోకి తీసుకుంది. పంజాగుట్ట నివాసి

భారీగా హుక్కా సామగ్రి స్వాధీనం

ఇద్దరి అరెస్ట్‌ 

హైదరాబాద్‌ సిటీ: హుక్కా పార్లర్‌ నిర్వాహకుడితోపాటు మరో యువకుడ్ని సీసీఎస్‌ వెస్ట్‌జోన్‌ బృందం అదుపులోకి తీసుకుంది. పంజాగుట్ట నివాసి ఫెరోజ్‌ (25) బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లోని ఓ అపార్టుమెంట్‌లో ప్లాట్‌ అద్దెకు తీసుకుని హుక్కా పార్లర్‌ నిర్వహిస్తున్నాడు. ఏడాది కాలంగా ఆ కేంద్రంలో హుక్కా పార్లర్‌ సాగుతోందని సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టీమ్‌ పీసీ ఇమ్రాన్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందజేశాడు. దాడులు నిర్వహించిన పోలీసులు ఫెరోజ్‌తో పాటు అతడికి సహకరిస్తున్న మహ్మద్‌ ఖైఫ్‌(21)ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 హుక్కా పాట్స్‌, 8 బాక్స్‌ల హుక్కా ఫ్లేవర్స్‌, 3రోల్స్‌ సిల్వర్‌ ఫాయిల్స్‌, 3 హీటర్స్‌, 2 హుక్కా కోల్‌, 2 టోంగ్‌, 20 హుక్కా పైప్స్‌, 1 బాక్సు ఫిల్టర్‌, ఓ రిజిస్టర్‌ బుక్‌, రూ. 3,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-25T17:19:34+05:30 IST