Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 25 Jun 2022 15:45:10 IST

Hrithik Roshan రూమర్ గర్ల్ ఫ్రెండ్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన సుసానే ఖాన్

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan), సుసానే ఖాన్ (Sussanne Khan) 2000లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట 2014లో తమ దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. దంపతులుగా విడిపోయిన అనంతరం ఎవరి దారిని వారు చూసుకున్నారు. అనంతరం హృతిక్ బీ టౌన్ బ్యూటీ సబా ఆజాద్‌(Saba Azad)తో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. సుసానే ఖాన్ కూడా అర్స్‌లన్ గోని (Arslan Goni) అనే వ్యక్తితో ప్రేమలో మునిగితేలుతోంది. కానీ, ఈ బంధాలపై హృతిక్, సుసానే ఎక్కడ కూడా పెదవి విప్పలేదు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలకు మాత్రం హృతిక్- సబా, సుసానే- అర్స్‌లన్ జంటలుగా హాజరయ్యారు. ఈ పార్టీ జరిగిన నాటి నుంచి హృతిక్ రోషన్, సబా ఆజాద్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అభిమానులు రూఢి చేసుకున్నారు. 


సబా ఆజాద్ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లపై హృతిక్ కామెంట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు సుసానే ఖాన్ కూడా రిప్లై ఇస్తుంటారు. తాజాగా సబా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌కు సుసానే స్పందించారు. ‘చాలా అందంగా ఉంది సబా’ అని ఆమె రిప్లై ఇచ్చారు. హార్ట్ ఎమోజీలను కూడా జత చేశారు. ఇక సబా ఆజాద్ కెరీర్ విషయానికి వస్తే.. గతంలో ‘రాకెట్ బాయ్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. సోనీ లివ్‌లో ఈ సిరీస్ ప్రసారమయింది. ఈ షోలో జిమ్ సర్భ్, ఇష్వక్ సింగ్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషించారు. హోమీ జే. బాబా పాత్రలో జిమ్ సర్భ్ కనిపించగా, విక్రమ్ సారా‌భాయ్ పాత్రలో ఇష్వక్ సింగ్ నటించారు. యువకుడైన హోమీ బాబా లవర్ పాత్రలో సబా కనిపించారు. పార్సీ మహిళ పాత్రను ఆమె పోషించారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement