May 6 2021 @ 16:11PM

హృతిక్ రోషన్ తప్పుకున్నాడా..?

తమిళ హిట్ సినిమా విక్రమ్ వేదా బాలీవుడ్ రీమేక్ నుంచి హృతిక్ రోషన్ తప్పుకున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవన్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ హీరోలు సెట్ కాక మేకర్స్ డైలమాలో ఉన్నారు. హిందీలో మాత్రం సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్ ముఖ్య పాత్రల్లో రీమేక్ ప్లాన్ చేశారు. అయితే అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వచ్చి చేరారు. పాత్రకు తగ్గట్టు తన మేకోవర్‌ను కూడా మార్చుకునేందుకు రెడీ అయ్యాడని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా హృతిక్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు బీ టౌన్ మీడియాలో వినిపిస్తోందట. ప్రస్తుతం హృతిక్ 'వార్' సీక్వెల్ తో పాటు 'క్రిష్4' చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉండటం వల్లే విక్రమ్ వేదా బాలీవుడ్ రీమేక్ కోసం హృతిక్ డేట్స్ సర్ధుబాటు చేయలేక తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవముందనే విషయం చిత్ర బృందం వెల్లడిస్తేగాని నమ్మలేము.