Oct 25 2021 @ 15:34PM

రూ. 97.50 కోట్ల విలువైన ఫ్లాట్లు కొనుగోలు చేసిన Hrithik Roshan!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు కొనుగోలు చేసినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలను తాజాగా రాకేష్ రోషన్ ధ్రువీకరించారు. ముంబైలోని అత్యంత ఖరీదైన జుహు-వెర్సోవా లింక్ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో మూడు ఫ్లోర్లలో విస్తరించి ఉన్న రెండు ఫ్లాట్లను హృతిక్ కొనుగోలు చేశాడట. 


అందుకోసం ఏకంగా రూ.97.50 కోట్లు ఖర్చుపెట్టాడట. అయితే హృతిక్ ఇప్పటికిప్పుడు తన పాత ఇంటిని వీడే ప్రసక్తి లేదని సమాచారం. హృతిక్ ఎప్పట్నుంచో తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. భార్య సుషానే ఖాన్ విడాకులు ఇచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. ప్రస్తుతం పెట్టుబడి నిమిత్తమే ఆ ఫ్లాట్లను హృతిక్ కొనుగోలు చేశాడని, తన ఇద్దరి కొడుకుల కోసం వాటిని కొని ఉంటాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. 

Bollywoodమరిన్ని...