Jun 11 2021 @ 12:37PM

నిర్మాతగా హృతిక్ రోషన్..?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నిర్మాతగా మారనున్నట్టు తాజాగా నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన పేరు మీద బ్యానర్ స్థాపించి నిర్మాతగా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను తీయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా బీ టౌన్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనికి 'హృతిక్ రోషన్ ఫిల్మ్స్' అని పేరు పెట్టనున్నారట. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ 'సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్', అమీర్ ఖాన్ 'అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్', షారుఖ్ ఖాన్ 'రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్', అక్షయ్ కుమార్ 'హరి ఓం ఎంటర్టైన్మెంట్స్' అనే నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్‌లో ఇప్పుడు హృతిక్ కూడా జాయిన్ అవనున్నట్టు సమాచారం. కాగా 'వార్' తర్వాత ఈ హీరో నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు.