Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 24 Jan 2022 13:25:29 IST

మరో మలయాళ మూవీపై కన్నేసిన టాలీవుడ్ మేకర్స్

twitter-iconwatsapp-iconfb-icon
మరో మలయాళ మూవీపై కన్నేసిన టాలీవుడ్ మేకర్స్

ఈ నెల 21న థియేటర్స్ లో విడుదలైన మలయాళ ప్రేమ కథాచిత్రం ‘హృదయం’. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్, లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ తనయ కళ్యాణి జంటగా నటించిన ఈ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ కైవసం చేసుకుంది. మలయాళ విలక్షణ నటుడు శ్రీనివాసన్ తనయుడు వినీత్ శ్రీనివాసన్ ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటి వరకూ ఈ యంగ్ డైరెక్టర్ తీసిన సినిమాలన్నీ మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. గతంలో యం.యస్.నారాయణ తనయ శశికిరణ్ డైరెక్ట్ చేసిన ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాకి మూలమైన మలయాళ చిత్రం ‘తట్టత్తిన్ మరయత్తు’ కి దర్శకుడు అతడే. ఆ సినిమా మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ‘హృదయం’ చిత్రం కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంటోంది. ఫస్ట్ డే దాదాపు రూ. 3కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. హీరో ప్రణవ్ మోహన్ లాల్ కిది నాలుగో చిత్రం. 


ఈ సినిమాపై ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ కన్ను పడింది.  ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, యూత్ మెచ్చే ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉండడంతో ‘హృదయం’ చిత్రాన్ని టాలీవుడ్ లో ఎట్టిపరిస్థితుల్లోనైనా రీమేక్ చేయాలి అనుకుంటున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ అప్పుడే ఈ సినిమా రీమేక్ రైట్స్ కైవసం చేసుకుందని టాక్. ఇంతకు ముందు ‘ప్రేమమ్’ చిత్రం సెస్సేషన్ క్రియేట్ చేయగా..  టాలీవుడ్ లో అప్పుడూ ఇలాగే పోటీ నెలకొంది. ఎట్టకేలకు నాగచైతన్యతో సినిమా రీమేక్ అయింది. మరి ఇప్పుడు ‘హృదయం’ చిత్రం ఏ హీరోతో తెరకెక్కుతుందో, ఆ నిర్మాత ఎవరో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International