Viral News: షాకింగ్.. అంత్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచిన 3ఏళ్ల అమ్మాయి.. తర్వాత కొద్ది సేపటికే..

ABN , First Publish Date - 2022-08-26T13:53:10+05:30 IST

మూడేళ్ల కూతురు విపరీతమైన జ్వరంతో బాధపడుతోంది. దానికి తోడు విపరీమైన కడుపు నొప్పి, వాంతులు కూడా జరుగుతుండటంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కాసేపు ఆ చిన్నారికి చికిత్స అందజేశారు. ఆ తర్వాత చిన్నారిని బతి

Viral News: షాకింగ్.. అంత్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచిన 3ఏళ్ల అమ్మాయి.. తర్వాత కొద్ది సేపటికే..

ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల కూతురు విపరీతమైన జ్వరంతో బాధపడుతోంది. దానికి తోడు విపరీమైన కడుపు నొప్పి, వాంతులు కూడా జరుగుతుండటంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కాసేపు ఆ చిన్నారికి చికిత్స అందజేశారు. ఆ తర్వాత చిన్నారిని బతికించలేకపోయామని వాపోయారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరుసటి రోజు ఆ చిన్నారికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి కళ్లు తెరిచింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహటిన ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


మెక్సికో(Mexico)లోని విల్లా ది రోమాస్ ప్రాంతానికి చెందిన కమిలా రోక్సానా మార్టినెజ్ మెన్డోజా(Camila Roxana Martinez Mendoza) అనే మూడేళ్ల చిన్నారికి తాజాగా తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పితో బాధపడింది. దీనికి తోడు ఆ చిన్నారికి వాంతులు కూడా జరగడంతో.. తల్లి కంగారుపడింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ అమ్మాయిని పరీక్షించిన వైద్యుడు భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చాడు. కొన్ని మందులు రాసిచ్చి.. వాటిని వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పాడు. డాక్టర్ మాటలు నమ్మి, వాళ్లు ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ చిన్నారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో కమిలా కుటుంబ సభ్యులు ఆమెను మరో వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. కొన్ని ట్యాబ్లెట్లు రాసిచ్చి.. పాపకు పండ్ల రసాలు ఇవ్వాలని కుటుంబ సభ్యులకు సూచించాడు. కుటుంబ సభ్యులు డాక్టర్(Doctor) చెప్పినట్టే చేశారు. అయినా చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో ఆసుపత్రితో అడ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్.. చిన్నారికి ఆక్సిజన్ అమర్చి, ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి.. పాపను బతికించలేకపోయాం అంటూ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి వాపోయాడు. డీహైడ్రేషన్ కారణంగా పాప మరణించిందని ధ్రువకరించాడు. 



వైద్యుడి మాటలు విని.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తర్వాత కమిలా మృతదేహాన్ని తీసుకుని.. ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు చిన్నారికి అంత్యక్రియలు చేస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి చిన్నగా కళ్లు తెరవడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. దీంతో హుటాహుటిన కమిలాను అంబులెన్సులో తిరిగి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు తిరిగి పాపకు వైద్యం ప్రారంభించారు. ఈ క్రమంలోనే చిన్నారి మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు తొలుత వైద్యం చేసిన డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం చేయలేక.. తమ కూతురు చినిపోయిందంటూ చేతులెత్తేశాడని ఆవేదన చెందారు. ఈ వార్త స్థానికంగా(Viral News) చర్చనీయాంశం అయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-08-26T13:53:10+05:30 IST