వనపర్తి ఎస్పీకి హెచ్‌ఆర్సీ తాఖీదు

ABN , First Publish Date - 2020-04-04T09:59:54+05:30 IST

వనపర్తి ఎస్పీకి హెచ్‌ఆర్సీ తాఖీదు

వనపర్తి ఎస్పీకి హెచ్‌ఆర్సీ తాఖీదు

దాడి ఘటనపై వివరణకు ఆదేశం

నకిరేకల్‌లో కర్ర విసిరిన కానిస్టేబుల్‌

యువకుడి కంటికి గాయాలు

హైదరాబాద్‌, నకిరేకల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తిపై కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటనపై మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మా నాన్నను కొట్టొద్దు అంకుల్‌’’ అంటూ బాధితుడి కొడుకు ప్రాధేయపడుతున్నా.. కానిస్టేబుల్‌ వినకుండా దాడిచేసిన ఘటనపై వివరణ ఇవ్వాలంటూ వనపర్తి ఎస్పీకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. జూన్‌ 8లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది. రామచంద్రారెడ్డి అనే న్యాయవాది గురువారం ఈ-మెయిల్‌ ద్వారా పిటిషన్‌ దాఖలు చేయగా.. హెచ్‌ఆర్సీ ఈ ఘటనను సీరియ్‌సగా తీసుకుంది. కాగా.. నల్లగొండ జిల్లాలో కానిస్టేబుల్‌ కర్ర విసరడంతో ఓ యువకుడి కంటికి గాయమైంది. నకిరేకల్‌కు చెందిన మౌలాలి, శుక్రవారం ఉదయం కూరగాయలు కొనేందుకు బైక్‌పై బజారుకు వెళ్లాడు. లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ అతడిని ఆపేందుకు యత్నిస్తూ.. కర్ర విసిరాడు. ఈ ఘటనలో మౌలాలి కంటికి గాయమైంది. ఈ ఘటనపై సీఐ బాలగోపాల్‌ కథనం మరోలా ఉంది. మౌలాలిని ఆపేందుకు కానిస్టేబుల్‌ యత్నించగా.. అతడు బైక్‌పై వేగంగా వెళ్తూ కింద పడి ఉంటాడని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-04T09:59:54+05:30 IST